అల‌ర్ట్ – ఒకే ఒక్క‌డు నుంచి 222 మంది‌కి క‌రోనా

అల‌ర్ట్ - ఒకే ఒక్క‌డు నుంచి 222 మంది‌కి క‌రోనా

0
97

ఈ వైర‌స్ గురించి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా అది సోకుతోంది, అతి జాగ్ర‌త్త‌లు చాలా ముఖ్యం
అంటున్నారు వైద్యులు, మాస్క్ ధ‌రించినా భౌతిక దూరం పాటించినా కొంద‌రికి వైర‌స్ సోకుతోంది.
కానీ కొంత మంది నిర్లక్ష్యం వందల… వేల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

కరోనా ఒకరి నుంచి ఒకరికి వెంటనే సోకుతుందని. చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా ఏకంగా 222 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గత నెల 21న తొలి పాజిటివ్ కేసు నమోదైంది.

ఇక్క‌డ నుంచి పాజిటీవ్ కేసులు నిత్యం వ‌స్తూనే ఉన్నాయి, ఒక్క మామిడాడలోనే ఏకంగా 119 మంది వైరస్ బారినపడడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపూడి మండలంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 125కు చేరింది, అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాలి అనుమానం ఉంటే మాత్రం ఇంట్లో వారితో బ‌య‌ట వారితో క‌లిసి తిర‌గ‌కండి వెంట‌నే ఆస్ప‌త్రికి టెస్ట్ కోసం రావాలి అంటున్నారు వైద్యులు.