అలర్ట్- ఈ పొరపాట్లు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రావు..సరి చేసుకోండిలా..

Alert- PM Kisan will not get money if he makes these mistakes..come right ..

0
83
Pm Kisan samman

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నారు. అయితే ఏప్రిల్-జూలై మధ్య మొదటి విడత. ఆగస్ట్-నవంబర్ మధ్య రెండవ విడత. డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడతల వారిగా రూ. 2వేలు వారి అకౌంట్లలో జమ చేస్తారు.

అయితే ఈ పీఎం కిసాన్ నగదు వాయిదాల ప్రకారం ఆఆధార్ కార్డుతో లింక్ చేయబడిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే ఇప్పటికే 9 విడతల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. ఇందులో కొందరు అన్నదాతలకు ఈ నగదు రాలేదు. అందుకు కారణం..వారి ఆధార్ నంబర్, ఖాతా నంబర్ వంటి ముఖ్య సమాచారన్ని తప్పుగా ఎంటర్ చేయడం.

ఒకవేళ మీ ఆధార్ నంబర్ తప్పుగా ఎంటర్ చేసినట్లుగా భావిస్తే..వెంటనే మీరు పీఎం కిసాన్ వెబ్ సైట్‏కు లాగిన్ అయి వివరాలను మరోసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే..

ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ pmkisan.gov.inకి లాగిన్ కావాలి.

ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి.
అందులో ఆధార్ సవరణ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అనంతరం మీ ఆధార్ నంబర్ చెక్ చేసి.. ఒకవేళ తప్పుగా ఉంటే సరిచేసే పేజీ ఓపెన్ చేయాలి.
అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉంటే..వెంటనే సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా లేఖఫాల్ ను సంప్రదించాలి.