అలర్ట్ — భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు – ఎప్పటి నుంచంటే

-

ఈ నెలలో కాస్త టీవీల ధరలు పెరగడం తెలిసిందే, అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ధరలు కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది అంటున్నారు స్మార్ట్ ఫోన్ నిపుణులు, అవును దీనికి ఓ ప్రధాన కారణం ఉంది అని చెబుతున్నారు.

- Advertisement -

భారత ప్రభుత్వం స్మార్ట్ఫోన్ల డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై ఇంపోర్ట్ డ్యూటీ 10% విధిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో ఈ దిగుమతులు తగ్గి సొంతంగా మన దేశంలో ఈ ఐటెమ్స్ ఉత్పత్తి తయారీ పెరగాలి అని భావిస్తోంది, అందులో భాగంగా ఇవి ఇంపోర్ట్ చేసుకుంటే 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది

స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోళ్లు పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకుంటోంది, దీంతో స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది.. డిస్‍ప్లే, టచ్ ప్యానెళ్లపై 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది కాబట్టి ఆ పది శాతం వినియోగదారుడిపైనే భారం పడుతుంది..ఖరీదైన ఫోన్లకు కూడా ఈ డ్యూటీ భారీగా పడుతుంది..10,000 ఫోన్పై అదనంగా రూ.1000నుంచి రూ.1200వరకు భారం పడే అవకాశముంది అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....