తెలంగాణ రైతులకు అలెర్ట్..ఆ మార్పులకు నేడే చివరి తేదీ!

0
102

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు, రైతుభీమా. ఈ పథకాల ద్వారా అనేక రైతులు లబ్ది పొందుతున్నారు. పెట్టుబడి సాయంగా ఒక్క సీజన్ కు ఎకరానికి 5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది సర్కార్.

ఇక రైతుభీమా కూడా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా ఏదో కారణంతో మరణిస్తే వారికి 10 రోజుల్లోనే రూ.5 లక్షలు అందిస్తుంది. అయితే చాలా మంది రైతులు నూతనంగా పాస్ పుస్తకాలు వచ్చాయి. అలాంటి వారికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. నామిని చనిపోతే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా మార్చుకోవచ్చు.బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈఈరోజు (జూలై 20న) లాస్ట్ డేట్ కావడంతో ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.