Big news: హైదరాబాద్ వాసులకు అలెర్ట్..నేడు పలు MMTS సర్వీసులు రద్దు

0
113

తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నుండు కుండలా మారాయి. రాబోయే 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీనితో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

దీని ప్రభావంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

రైళ్ల వివరాలు ఇలా..

లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రాకపోకలు నిలిచిపోనున్నాయి.

ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

మొత్తంగా 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసింది.