అలీకి జగన్ ఇచ్చిన హమీ ఇదేనట

అలీకి జగన్ ఇచ్చిన హమీ ఇదేనట

0
87

గత కొద్ది రోజులుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని అలీకి కట్టబెడుతున్నారని లీకులు వచ్చాయి కాని ఆయన ఈ పదవిని తీసుకోవడానికి ఇష్టం చూపించలేదట ఎందుకు అంటే ఆయన ముందు నుంచి ఎమ్మెల్యే అవ్వాలి అని కోరికగా ఉన్నారు అంతేకాదు, తనకు రాజకీయంగా మంత్రి అవ్వాలని ప్రజాసేవ చేయాలని కోరిక ఉందని చెప్పాడు అలీ , అందుకే చివరి వరకూ చర్చలు జరిపిన సీఎం జగన్ ఆ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్‌కి అప్పగించారు

అలీకి ఈనామినేటెడ్ పదవి కాదు అని ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గతంలో కోరిన విధంగా రెండో టర్మ్ మంత్రి పదవి ఇవ్వనున్నారు అని వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా జగన్ అందుకే అలీ విషయంలో ఈ పదవిని ఇవ్వలేదు అని తెలుస్తోంది. అలీ కూడా అందుకే ఈ పదవి తనకు వద్దు అని చెప్పారట. అయితే అలీ కూడా మంత్రిగా సేవ చేయాలి అని చూస్తున్నారు, ఆయనకు సీటు కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ ఇవ్వలేదు, గుంటూరు సీటు కోరినా అక్కడ ముందుగానే వైసీపీ తరపున సీటు మరొకరికి ఇవ్వడంతో జగన్ అలీకి హామీ ఇచ్చారు, హమీ ప్రకారం ఆయనకు వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారట. అయితే అలీకి మాత్రం ఇప్పుడు ఈ పదవి ఇవ్వకపోవడంతో పెద్ద షాక్ తగిలింది అని అందరూ భావిస్తున్నారు, అయితే అలీ మాత్రం జగన్ నుంచి హమీ రావడంతో ఎలాంటి కామెంట్లు చేయడం లేదు అని తెలుస్తోంది.