సాధారణంగా ఓ గ్రామంలో తీసుకుంటే రెండు లేదా మూడు కుటుంబాల్లో కవల పిల్లలు ఉంటారు అనేది తెలిసిందే.. ఇక సిటీ టౌన్ అయితే వీధిలో ఒకరు ఉండవచ్చు… కాని ఇప్పుడు మనం చెప్పుకునే గ్రామంలో ఏకంగా 200 మంది కవల పిల్లలు ఉన్నారు.. ఇది అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది…ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఉండే జనాభా కేవలం రెండు వేలు మంది.. ఇందులో రెండు వందల మంది కవల పిల్లలు ఉన్నారు.
మన దేశంలో కేరళలోని కోడిన్హి గ్రామం లో ఇక్కడ కవలలు వందల మంది ఉన్నారు, ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదు
..ఇక్కడకు ఎంతో మంది శాస్త్రవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి పరిశోధనలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గ్రామానికి సంబంధించిన మిస్టరీ చేధించలేదు.
చాలా మందికి టెస్టులు చేశారు అయితే ఎప్పటి నుంచో ఈ గ్రామంలో వారు ఇలా కవలలకు జన్మనిస్తున్నారట, అందుకే ఇక్కడ వారికి మాత్రమే వివాహం చేసుకుంటున్నారు… సో మరి ఈ గ్రామంలో పిల్లలను చూసేందుకు చాలా మంది వస్తూ ఉంటారు.. ఈ కరోనా సమయంలో ఎవరూ రావడం లేదు కాని, అంతకుముందు చాలా మంది వచ్చేవారట.