అవన్నీ తప్పుడు సర్వేలు..తెలంగాణలో అధికారం హస్తం పార్టీదే: కోమటిరెడ్డి

0
91

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా..కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని అన్నారు.

అయితే ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కెసిఆర్ అప్పుల ఊబిలోకి నెట్టాడు. ప్రజాదరణ,పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి..సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తామన్నారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.