ఆ ఒక్కరితోనే పొత్తు..జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు

0
88

ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలురైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జనసేనకు ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని.. రాష్ట్రం బాగు కోసం తమను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేశారు.

ప్రజలు ముందుకెళ్లేందుకు మాత్రమే ఆలోచిస్తానన్న పవన్.. రాబోయే ఎన్నికల్లో తమకు అండగా ఉండి, ఆశీర్వదించాలని కోరారు. దసరా వరకు వైకాపా నేతలు ఏమన్నా పట్టించుకోబోమన్న పవన్.. ప్రజల సమస్యలు వినడానికి దసరా తర్వాత రోడ్డెక్కుతామని, అప్పుడు వాళ్లకు ఉంటుందని అన్నారు.

జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైకాపా వాళ్లకి ఉన్నప్పుడు.. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని చెప్పారు. చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండని కోరారు.