నరసాపురం రానున్న బన్నీ నాగబాబుకు ప్రచారం డేట్ ఫిక్స్

నరసాపురం రానున్న బన్నీ నాగబాబుకు ప్రచారం డేట్ ఫిక్స్

0
99

మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ మినహా మిగిలిన వారు అందరూ కూడా నరసాపురం రానున్నారు అని తెలుస్తోంది. ఎందుకు అంటే ఇక్కడ జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు నాగబాబు… పవన్ కల్యాణ్ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ జోష్ వచ్చింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఈ హీరోలు అందరూ ప్రచారంతో నరసాపురం పాలకొల్లు భీమవరం వెలుగువెలుగుతాయి అంటున్నారు.ఇక ఈ విషయాన్ని నాగబాబు భార్య పద్మజ ఓ ఇంటర్యూలో తెలియచేశారు.

వరుణ్ ఓ షూటింగ్ నిమిత్తం ఫారెన్ లో ఉన్నారు అని, ఈనెల 5 న వరుణ్ తేజ్ ప్రచారం చేస్తారు అని, అలాగే బన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారు అని చెప్పారు. ఇప్పటికే నాగబాబు భార్య పద్మజ కుమార్తె నిహారిక ప్రచారంలో పాల్గొన్నారు. నాగబాబుకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. మొత్తానికి ఇక్కడ ఎన్నికల్లో నాగబాబు అభ్యర్దులకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు అని చెబుతున్నారు.. ఇక మెగా అభిమానులు ఈ న్యూస్ తెలియగానే ఎంతో సంతోషంలో ఉన్నారు.