ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై, అలాగే ఆయనకుమారుడు నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కుండపోతలా కురుస్తున్న వర్షానికి అమరావతిలో అక్రమంగా కట్టించుకున్న తన నివాసం మునిగిపోతుందని గ్రహించి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు పారిపోయారని మండిపడ్డారు…
ఎప్పుడైతే నాగార్జున సాగర్ గేట్లు మూశారో అప్పుడు అమరావతిలో దర్శనం ఇచ్చారని అన్నారు… ప్రజల్లో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో చేయి నొప్పివల్లే చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లారని అంటున్నారు, ఏపీలో డాక్టర్లు లేరా అని అంబటి ప్రశ్నిచారు…
అయన హైదరాబాద్ లో ఉంటే అయన కుమారుడు లోకేష్ ఎక్కడికి వెళ్లినట్లు అని ప్రశ్నించారు…. తాను గుడిలో పూజారి నని చెప్పి కోడెల గుడిలో లింగాన్ని దొంగిలించారని అన్నారు.. రాజధాని మారుస్తారని వస్తున్న వార్తలు నమ్మొద్దని కేపిటల్ ని మార్చే యోచన ప్రభుత్వానికి లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానిని అమరావతిలో కట్టొద్దని శివరామకృష్ణన్ చెప్పిన విషయాన్ని మాత్రమే బొత్స ప్రస్తావించారని అన్నారు