2024లో జగన్ అధికారం కోల్పోవడానికి ఇలాంటి వారు ఒక్కరు ఉంటే చాలు

2024లో జగన్ అధికారం కోల్పోవడానికి ఇలాంటి వారు ఒక్కరు ఉంటే చాలు

0
100

మాజీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులతోపాటు ఆప్రాంత ప్రజలు కూడా మండిపడుతున్నారు… అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయనపై ఇటీవలే కేసులు నమోదు చేశారంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఎలాందో ఇట్టే అర్ధం అవుతోంది…

అందుకే జగన్ ఆమంచి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆప్రాంత ప్రజలు అంటున్నారు… 2014లో ఇండిపెడెంట్ గా గెలిచిన ఆమంచి ఆతర్వాత టీడీపీలో చేరారు. అప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి వారిపై అక్రమకేసులు పెట్టారు. ఇక టీడీపీ లోకూడా ఆయనపై వ్యతిరేకత పెరగడంతో వైసీపీలో చేరారు.

ఆయన వైసీపీలో చేరికను చీరాల ప్రజలు నాయకులు వ్యతిరేకించారు కానీ జగన్ పార్టీ కీలకనేతల ఒత్తిడితో వైసీపీలో చేర్చుకున్నారు.ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామి ఏరులై పారినా చీరాలలో మాత్రం పారలేదు దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో…

ఈ సారి కూడా ఆమంచి అధికార పక్షానికి చెందిన వారు కావడంతో మళ్లీ తన పాత పందాను మొదులు పెట్టారు.. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టడం మొదలు పెట్టారు… అందులో భాగంగా నాగార్జున రెడ్డిపై దాడిచేయించారు. ఆయన్ను చచ్చేదాక కొట్టించారు. ఈయనపై జగన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.