ఆ పని చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు: అంబటి

-

గడప గడపకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హమీల గురించి ఎల్లో మీడియా వార్తలు ఇవ్వదని, కనీసం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి రాయరు అని ఎద్దేవా చేశారు. నిత్యం విష ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పని అని ధ్వజమెత్తారు. గడప గడపకు కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని.. సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకుంటున్నామని అన్నారు. మేనిఫెస్టోలో 95 శాతంపైగా వాగ్ధానాలను నెరవేర్చామన్నారు. అమరావతి రైతుల్లోని కోటీశ్వరులు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పోలవరం నాశనం అయిపోవాలన్నదే ఎల్లో మీడియా కోరిక అని ఆరోపించారు. సీఎం జగన్‌ కంటే గొప్ప పరిపాలన చేశామని చంద్రబాబు చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...