జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టడానికి రీజన్ అదేనట…

జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టడానికి రీజన్ అదేనట...

0
71

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించలేక అప్పుడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఎన్టీఆర్ తో ప్రచారం చేయించి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిన తర్వాత ఆయన్ను పక్కకి నెట్టేశారని ఆరోపించారు… అలాగే తన సొంత సోదరుడుని కూడా రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఆరోపించారు… ఇవన్ని చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ ను రాజకీయ వారసుడిని చేయడం కోసం చేశారని అంబటి ఆరోపించారు..

తన కుమారుడు కోసం రాష్ట్రాన్ని పార్టీని సర్వనాశనం చేశారని ఆరోపించారు… వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేస్తారంటే అది చంద్రబాబు నాయుడు చేస్తారని అందరికి తెలుసని అన్నారు… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పిచ్చిసవాళ్లు చేస్తున్నారని ఆరోపించారు…