తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. సీఎం నిర్ణయంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏమన్నారంటే?

0
66

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తాజాగా సీఎం నిర్ణయంపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితుల కోసం దళితబంధు తెచ్చి పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి ఆ పేరును సార్ధకం చేశారన్నారు.

ఈ నిర్ణయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తరపున రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కు కేసీఆర్ అందించిన గౌరవంగా అభివర్ణించారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని మంత్రి డిమాండ్ చేశారు.