అమీర్ పేట-ఎల్బీ నగర్ మెట్రో ఈ నెల 24న ప్రారంభం

అమీర్ పేట-ఎల్బీ నగర్ మెట్రో ఈ నెల 24న ప్రారంభం

0
186

హైదరాబాద్ లో అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఇప్పటికే ప్రారంభించిన మియాపూర్‌-నాగోల్‌ మార్గంతో రవాణా సౌకర్యం సులభతరమైంది.దీంతో మెట్రో అధికారులు అమీర్‌ పేట నుంచి ఎల్బీనగర్‌ మార్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో అధికారులు ఈ మార్గంలో పనులను పూర్తి చేసి.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.గవర్నర్ నరసింహన్ ఈ నెల 24న మధ్యాహ్నం 12.15 గంటలకు అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో లైన్‌ను ప్రారంభిస్తారు. కాగా మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి రావల్సిందిగా మంత్రి కేటీఆర్ బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆహ్వానించారు. కేటీఆర్‌తో పాటు సీఎస్ ఎస్‌కే జోషి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎంఏఅండ్‌యూడీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.