భారత్ ప్రకటనను సవుర్థించిన అవెురికా

భారత్ ప్రకటనను సవుర్థించిన అవెురికా

0
105

కేంద్ర ప్రభుత్వం జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, అండర్ వరల్ డాన్ దావూద్ ఇబ్రహీం, కశ్మీర్ లో లష్కరే తాయిబా సుప్రీం కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీలను టెర్రరిస్టులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన కొత్త ’ఉగ్రవాద వ్యతిరేక చట్టం’ కింద వీరిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా సమర్థించింది.

భారత్‌ అజార్, సయీద్, దావూద్, రెహ్మాన్ లను టెర్రరిస్టులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. టెర్రరిజాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ కు అండగా ఉంటామని అవెురికా భరోసా ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా భారత్-అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఉపయోగపడుతుందని అవెురికా చెప్పింది.