ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళుతున్న సమయంలో వాటిని వదిలేసిన అమెరికా – నెటిజన్లు తీవ్ర విమర్శలు

America left them on the way out of Afghanistan

0
100

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయాయి. అయితే వెళ్లే సమయంలో వారు చేసిన ఓ పని గురించి నెటిజన్లు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అయితే అమెరికా మిలిటరీ అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆయుధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆగస్టు 31 గడువులోపే అమెరికా దళాలు ఆఫ్ఘన్ ను వీడాయి. ఆ దేశం వారిని అందరిని తీసుకువెళ్లారు. సైనికులు అందరూ వెళ్లిపోయారు అయితే వారికి అప్పటి వరకూ ఎంతో సాయం చేసి, వారితో సర్వీస్ చేసిన జాగిలాలను మాత్రం వదిలేశారు.

తొందరపాటులో మిలిటరీ జాగిలాలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారని తెలుస్తోంది. దీనిపై
విమర్శలు వస్తున్నాయి. కాబూల్ లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వీటిని పరిరక్షిస్తోంది. వీటిని అమెరికాకి పంపించేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తారట. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే భారత్ ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ లో గత మూడేళ్లుగా సేవలందించిన జాగిలాలను స్వదేశానికి తీసుకువచ్చింది. దీంతో ఆ జాగిలాలని అలా ఎలా వదిలి వచ్చారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.