అమెరికాలో దారుణమైన స్దితిలో కరోనా ఉంది.. అక్కడ పెద్ద ఎత్తున వ్యాధి వ్యాప్తి చెందుతోంది, ఓ పక్క విమానాల రాకపోకలు ఆగిపోయాయి ట్రాన్స్ పోర్ట్ ఆగిపోయింది, జనజీవనం రోడ్లపైకి రావడం లేదు కాని ఈ కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి.
వైద్య సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉన్నారు.. వెంటిలేటర్ పై చికిత్స తీసుకునే వారు పెరుగుతున్నారు. ఇది అమెరికాని భయపెడుతోంది. వెంటిలేటర్ పై చికిత్స తీసుకునే వారు పెరగడంతో పరిస్దితి పై నిత్యం అధికారులు సమీక్ష జరుపుతున్నారు.
ఇదే అమెరికాని వణికిస్తోంది, పూర్తిగా వెంటిలేటర్లు ఉన్నా అక్కడ మరిన్ని కేసులు పెరగడం కూడా ఆలోచన కలిగిస్తోంది.. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 10 వేల కేసులు నమోదు అయ్యాయి, 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ అమెరికాలో 55 వేలకు పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి మొత్తం 780 మంది మృతి చెందారు.