ఉల్లి ఎంతో మేలు చేస్తుంది, అసలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు, అయితే ఉల్లి ప్రతీ దేశంలో తింటారు ఆహారంలో ఉల్లి ఘాటు ఉంటే ఇక ఆ టేస్ట్ వేరు అని చెప్పాలి, కాని ఇప్పుడు అమెరికా మాత్రం ఎర్ర ఉల్లి పేరు చెబితే భయపడుతోంది ఆ ఫుడ్ రెస్టారెంట్లో కూడా తినడం లేదు.
సూపర్ మార్కెట్లు వెజిటేబుల్ స్టోర్స్ లో ఉల్లి వైపు చూడటం లేదు…అమెరికాలో ఉల్లిపాయల వల్ల భయంకర మైన సాల్మోనెల్లా వ్యాధి దేశాన్ని చుట్టేస్తోంది. కరోనాను మించి దీని ప్రభావం ఉంటుందని అక్కడి వైద్యులు అంచనా వేస్తున్నారు, ఇది చాలా డేంజర్ వ్యాధి, నెమ్మదిగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపిస్తుంది.
కడుపు నొప్పి ఉబ్బరం విరోచనాలు ఫీవర్ వస్తాయి, అమెరికాలో 34 రాష్ట్రాల్లో 400 మంది ఈ బాక్టీరియా బారిన పడినట్లు తెలుస్తోంది.మంచి నీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చని అంటున్నారు. అయితే ఇది ఉల్లిపాయ నుంచి వస్తోంది, అందుకే ఆ ఎర్ర ఉల్లిపాయలు ఎవరూ తినడం లేదు.