ఇరాన్ అమెరికా మధ్య వివాదం మరింత రాజుకుంది.. యుద్దసన్నాహాలకు రెండు దేశాలు సిద్దం అవుతున్నాయి, ఇరాన్ ఆర్మీకమాండర్ సులేమాని చంపడం పై అమెరికా విషయంలో ఇక సహించేది లేదు అని ఇరాన్ తెలియచేస్తోంది, యుద్దానికి రెడీ అవుతోంది ఇరాన్, మరోపక్క శత్రువులని విడిచిపెట్టేది లేదు అంటూ ట్రంప్ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
గ్రీన్ జోన్ ఆర్మీ క్యాంపుల దగ్గర సుమారు 10 వేల మంది అమెరికా సైన్యాన్ని పంపింది, అయితే ఉగ్రవాద సంస్ధలు ఇప్పుడు అమెరికాని వాటి కార్యాలయాలని వివిద దేశాలలో టార్గెట్ పెట్టుకున్నాయి… కెన్యాలోని అమెరికా మిలటరీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా సీరియస్ గా ఉంది.
ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. గంటల వ్యవధిలో ఈ స్థావరంపై జరిగిన రెండో దాడి ఇది. మృతులలో ఒకరు మిలటరీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు. కెన్యాలోని లమూ తీర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై సోమాలియాకు చెందిన జిహాదీ సంస్థ అల్-షబాబ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రసంస్థకు ఆల్ ఖాయిదా సంస్థతో సంబంధాలున్నాయి. దీనిపై అమెరికా రక్షణ విభాగం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.