తెలంగాణలో పొలిటికల్ హీట్..టి బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ

Amit Shah meets BJP leaders in Telangana

0
115

హుజురాబాద్ బైపోల్ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం మధ్య వరి వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ పై మరింత ఒత్తిడి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రేపు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కుమార్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.

రాత్రికి బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ సమావేశం ఉండనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు, పాదయాత్ర ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరి పై అమిత్ తో చర్చించే అవకాశం ఉంది. అలాగే 2023 ఎన్నికలు ఎజెండాగా సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పై మరింత దూకుడు పెంచాలని అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమేశంలో విట్ఠల్, తీన్మార్ మల్లన్నను అమిత్ షాకు కలిపించే అవకాశం ఉంది.