తాజాగా బెంగళూరు మెట్రో గురించి దేశం అంతా చర్చించుకుంటున్నారు ..మెట్రోలో ఈవ్ టీజింగ్ కు పాల్పడినా లేదా అమ్మాయిలపై దాడులకు దిగినా ఇక పెప్పర్ బాటిల్ నుంచి వారిపై స్పె జల్లుతారు అమ్మాయిలు..తాజాగా మెట్రోలో అమ్మాయిలకు పెప్పర్ స్ప్రే బాటిల్ అనుమతి ఇచ్చారు. దీంతో చెకింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కనపడేశేవారు, ఇప్పుడు ఇలాంటి పరిస్దితి లేదు.
అయితే బెంగళురు మెట్రో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం కూడా ఉంది. చాలామంది ఉద్యోగులు కాలేజీ అమ్మాయిలు హ్యాండ్ బాగ్స్ లో
పెప్పర్ బాటిల్ తీసుకువెళుతున్నారట..ఈ మధ్య చెకింగ్ లో చూశారు. అయితే దిశ ఘటనతో ఇది మరింత పెరిగింది. దీంతో మెట్రో అధికారులు
కూడా వీటికి అనుమతి ఇస్తున్నారు.
టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే సాధారణంగా మెట్రోలో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల
త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు ఇవి వద్దు అంటారు. అయితే బెంగళూరులో దీనికి అనుమతి ఇచ్చారు. తాజాగా నెటిజన్లు హైదరాబాద్ మెట్రోలో కూడా ఇవి అనుమతించాలి అని కోరుతున్నారు.. కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇవి అనుమతి ఇవ్వాలి అంటున్నారు. మరి దీనిపై నిర్ణయం తీసుకోవాలి అని కోరుతున్నారు.