మన భారతీయ రైల్వే సంచలనాలు క్రియేట్ చేస్తుంది, దేశంలో ప్రజా రవాణా సరుకు రవాణాలో ముందు పొజిషన్లో ఉంటుంది, కోట్లాది మంది ప్రయాణాలకు రైల్వేనే వాడతారు,. తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేసింది ఏకంగా మూడు గూడ్సు రైళ్లను కలిపి… ఒకే రైలుగా విజయవంతంగా నడిపి చూపించింది.
బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను ఒకదాని వెనక ఒకటి జతచేసి నడిపి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది రైల్వే శాఖ. మనం గూడ్స్ రైల్ చూస్తే అసలు ఒకటే ఉంటుంది, కాని ఏకంగా ఇక్కడ మూడు కలిపి ఒకటే రైలుగా నడిపింది.
ఏకంగా ఈ ఇంజన్ కి ఎంత పవర్ ఉండాలి ఓ సారి ఆలోచించండి, . 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను వేగంగా నడుపుతూ… సూపర్ అనకొండ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది. సరికొత్తగా రైల్వే దీనిని నడిపింది. కరోనా టైమ్ కాబట్టి ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర ముఖ్యమైన వాటిని త్వరగా పంపాలని ఇలా చేశారు, ఇది సక్సెస్ అయింది, త్వరలో మరిన్ని అనకొండ గూడ్స్ ట్రైన్స్ నడుపుతారట.