ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం

ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం

0
83

వ్యాపారంలో ఆయనకు తిరుగులేదు అనే చెబుతారు, సామాజిక అంశాలపై కూడా నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.. ఆయనే మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.

ఆనంద్ మహీంద్ర తన పదవి నుంచి వైదొలగనున్నారట. డేట్ కూడా ప్రకటించారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందట. ఎం అండ్ ఎండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో ఈ విషయం తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు..

2020 ఏప్రిల్ 1 నుండి ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు (11 నవంబర్, 2020) ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. గోయెంకా స్థానంలో అనీష్ షా నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు..ఏప్రిల్ 2021 వరకు అనీష్ షా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొనసాగుతారట.. దీంతో కంపెనీ షేర్లు కొంచెం నష్టాల్లో నడిచాయి, ఇది సాధారణ నిర్ణయం అంటున్నాయి బిజినెస్ వర్గాలు.