అగ్నివీరులకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్‌

0
96

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ సైనిక నియామక పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ కీలక ప్రకటన చేశారు. అగ్నిపథ్ పథకం కింద శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను తమ సంస్థలో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఈ స్కీం వల్ల నెలకొన్న హింసాకాండను చూసి, తాను చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.  అగ్నివీర్స్ కావడానికి వారు పొందే శిక్షణ, నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యాలు ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని తాను గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడే చెప్పానని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అగ్నివీరులు తమ సర్వీస్‌ అయిపోయేనాటికి ఏ ఉద్యోగమైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలాంటి వారిని రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్ర గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

https://twitter.com/anandmahindra?