మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది చనిపోతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి లక్షలాది మంది వలసలు వెళ్లిపోతున్నారు. అందులో విద్యార్థులున్నారు. వేలాది మందిగా ఉన్న భారత విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టింది. కాగా భారత్ లో వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఉక్రెయిన్ లో మెడిసిన్ చందువుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే..”భారత్లో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం నాకు తెలియదు. మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్లో మెడికల్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించొచ్చేమో” అని ట్వీట్ చేశారు. దీనికి ఫీజులు అందుబాటులో ఉండేలా చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఒకవేళ మెడికల్ కాలేజీ వస్తే అది హైదరాబాద్ లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ప్రాంగణంలో మహీంద్రా యూనివర్సిటీ ఉంది. మహీంద్రా ఆలోచన సక్సెస్ అయితే హైదరాబాద్ క్యాంపస్ లో మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉంది.