ఇప్పుడు ఎక్కడ చర్చ జరుగుతున్నా అది కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించే.. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఈ మందు పంపిణీకి సిద్దం అవుతున్నారు ఆనందయ్య. అయితే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి తయారీకి ఆయన సిద్దం అవుతున్నారు.
ఆనందయ్య మందును కంట్లో వేయగానే లేచి ఎలా కూర్చుంటున్నారు? అసలు కంట్లో మందు వేస్తే ఎలా తగ్గుతుంది అని చాలా మంది ఆశ్యర్యపోతున్నారు, దీనికి దిల్లీ వైద్యులు ఏం చెబుతున్నారంటే పాము కాటుకు వంశపారంపర్యంగా మందు వేసే వైద్యుల్లో ఆనందయ్య ఒకరు. సాధారణంగా పాము కాటుకు పసర వైద్యం చేస్తారు.
అంతేకాదు ఆనందయ్యకు సిద్ద వైద్యంపై కూడా అవగాహన ఉంది. ఇక్కడ వైద్యులు చెప్పే విషయం ఏమిటి అంటే పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోతారు. అందుకే కంట్లో పసరు వేస్తే వెంటనే అది మెదడుకి చేరుతుంది.
శరీరంలో ఫాస్టెస్ అబ్జర్వేటివ్ రూట్ కంజుంక్టివా అంటే కంటి పొర అక్కడ డ్రాప్స్ వేస్తే మెదడులోకి చేరుతుంది. వందల ఏళ్ల నుంచి దీనిని ఫాలో అయ్యారు ఆనాటి వైద్యులు, పాము కాటు తర్వాత మెదడుకు ఆక్సిజన్ అందకపోతే చనిపోతారు రోగి. ఆసమయంలో ఇలా పసరు వేస్తారు. ఇలాగే ఆనందయ్య కూడా ఆలోచన చేశారు.ఆయన మందులో వాడే మూలికలు ఎలాంటి హనికరమైనవి కావు,అందుకే ప్రభుత్వం ఆనందయ్య మందుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.