పిల్లలు తల్లిని విడిచి అసలు ఉండలేరు అమ్మ అంటూ పిలుస్తూనే ఉంటారు… ఇక ఎదురుగా అమ్మ ఉండి తమని ఎవరైనా కట్టడి చేస్తే అసలు ఊరుకుంటారా ఊరుకోరు కదా.. ఇక్కడ అదే జరిగింది, ఓ యాంకర్ లైవ్లో వాతావరణ వార్తలు చదువుతుంటే ఆమె కుమారుడు హఠాత్తుగా వచ్చి హత్తుకున్నాడు. ఇలా లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలో బిడ్డ రావడంతో ఆమె కూడా ఉండలేకపోయింది.
కాళ్ల దగ్గర ఉన్న బాబుకి ఎత్తుకుని లైవ్ లో వార్తలు చదివేసింది ..ఆమె చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు, అయితే ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని ఇంట్లోనే వార్తలు చదువుతోంది అని తెలుస్తోంది…ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏబీసీ7 చానెల్ యాంకర్ లెస్లీ లోపెజ్ లైవ్లో వాతావారణ సమాచాన్ని చదువుతుండగా ఇలా జరిగింది…
మొత్తానికి నవ్వుతూ ఆమె అందంగా వార్తలు చదివింది , ఇక వార్తలు ముగించి నవ్వుతూ బాబు వచ్చేశాడు అని బ్రేక్ చెప్పేసింది, మరి మీరు కూడా ఆ వీడియో చూడండి.
Baby on the move! There is no stopping adorable Nolan now that he can walk during Mommy’s (@abc7leslielopez) forecast. #Love #goodmorning #ThursdayThoughts #Babies #TheBest @ABC7 pic.twitter.com/jvUcaSMyGi
— Brandi Hitt (@ABC7Brandi) January 28, 2021