ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ మృతి..రేవంత్ రెడ్డి సంతాపం

0
75

ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ రామకృష్ణ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల కాలంలో పాత్రికేయులు గుండె సంబంధ సమస్యలతో మృతి చెందుతున్నారు. ఈ విషయంలో పాత్రికేయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

సమాజానికి ఎంతో ఉపయోగపడే పాత్రికేయులు ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరం. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పాత్రికేయులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న..వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.