అందుకే జగన్ కు సపోర్ట్ చేస్తున్నా… చిరంజీవి

అందుకే జగన్ కు సపోర్ట్ చేస్తున్నా... చిరంజీవి

0
88

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి పలు సందర్భల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే… గత సంవత్సరం సైరా మూవీ సందర్భంగా చిరు దంపతులు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు…

దీంతో ఆయన పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి… దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు… తాను పార్టీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు.. దీంతో అందరికి క్లారిటీ వచ్చేసింది… అయితే తాజాగా మరోసారి చిరు క్లారిటీ ఇచ్చారు… సైరా మూవీ సందర్భంగా జగన్ ఇచ్చి అతిథ్యాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు…

వైఎస్ ఫ్యామిలీతో తనకు మంచి సంబంధం ఉందని అన్నారు… ఇక పిలుపు వస్తే వైసీపీలోకి వెళ్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్నారు… కానీ మంచి చేసిన వారిని అభినందిస్తానని అన్నారు… మూడు రాజధానుల కాన్సెప్ట్ తనకు నచ్చిందని అన్నారు…