మరో పోరాటానికి సిద్దమైన పవన్

మరో పోరాటానికి సిద్దమైన పవన్

0
90

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీశారు…. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప మన తెలుగు భాష సరస్వతి దేనికీ పనికి రాదనే విధంగా ప్రవర్తిస్తున్నారని పవన్ ఆరోపించారు…

అందుకే తాము మాతృ భాషను అలాగే నదులను పరిరక్షించుకునే దిశాగా మన నుడి మననది అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు ఈ మేరకు పవన్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు మద్దతు తెలపాలని అన్నారు…

రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని పవన్ అన్నారు…. ఇందుకు సంబంధించి వివరాలు త్వరలో వివరిస్తామని తెలిపారు పవన్… ప్రస్తుత పాలకులు కేంద్రం నుంచి తెలుగు కోసం డబ్బులు తీసుకుని ఇంగ్లీష్ కోసం ఖర్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు…