అనిల్ అంబానీ… ధీరూబాయ్ అంబానీ రెండవ కుమారుడు, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలో ఆయన కూడా ఒకరు, అయితే ఆయన బాడీ ఫిట్ నెస్ కు ఎంతో ప్రయారిటీ ఇస్తారు, ఉదయం ఐదు గంటలకు లేచి రన్నీంగ్ జిమ్ చేస్తారు,ఇక రోజూ యోగా చేయడం ఆయనకు అలవాటు, డైట్ అలాగే ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అనిల్ అంబానీ.
అనిల్ 1959 జూన్ 4 న జన్మించారు..అనిల్ అంబానీ ముంబయి యూనివర్సిటీలోని కిషన్ చంద్ చెల్లారామ్ కళాశాల నుంచి బీఎస్సీ చేశారు. తర్వాత 1983లో అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్ లో ఎంబీయే చదివారు. తర్వాత తన తండ్రి కంపెనీలో కో సీఈవోగా కూడా వర్క్ చేశారు.
2002లో తండ్రి మరణం తర్వాత ఆస్తులు పంచుకున్న తర్వాత, రిలయన్స్ పవర్…రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ , రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం, వినోద రంగం, ఆర్థిక సేవలు, విద్యుత్తు, మౌలిక వసతులు వంటి విభాగాల బాధ్యతలు ఆయన చూసుకునేవారు. అలాగే . 44 ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు, దేశవ్యాప్త డీటీహెచ్ కనెక్షన్లు, యానిమేషన్ స్టూడియోలు, పలు మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను ఆయన సంస్థలు నిర్వహిస్తున్నాయి.
అనిల్ అంబానీకిి ఒక సొంత జెట్ విమానం ఉంది. అంతేకాకుండా లాంబోర్గినీతో సహా పలు లగ్జరీ కార్లున్నాయి. ఆయన భార్య సినిమా నటి టీనా మునిమ్.. ఆమెకి ఒక సూపర్ లగ్జరీ యాట్ విలాసవంతమైన పెద్ద పడవ ని బహుమానంగా ఆయన ఇచ్చాడు..
టీనా మునిమ్ 1980 లో ప్రముఖ సినిమా హీరోయిన్. అనిల్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడి పేరు జై అనుమోల్ అంబానీ, కుమార్తె జై అన్షుల్ అంబానీ. కాని ప్రస్తుతం చాలా వరకూ ఆయన కంపెనీలు అప్పుల్లో ఉన్నాయి.