ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా…

ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా...

0
93

ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయం అక్కర్లేని కుటుంబం ఆనం కుటుంబం…. దశాబ్దాల కాలం నాటినుంచి రాజకీయాల్లో రాణించారు ఆనం బ్రదర్స్…. వైఎస్ కు ఆనం బ్రదర్స్ కు సన్నిహిత సంబంధం ఉంది… కాంగ్రెస్ హయాంలో ఆనం మంత్రిగా పనిచేశారు…

ఇక వైఎస్ మరణం తర్వాతం వారు కాంగ్రెస్ లో కొనసాగారు… ఎన్నికల సమయంలో గత్యంతరం లేక టీడీపీ తీర్ధం తీసుకున్నారు… అక్కడ కూడా ఆయన ఉండలేక పోయారు… 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్ధం తీసుకుని వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు… జిల్లాలో సీనియర్ నేత కనుక కచ్చితంగా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని భావించారు కానీ దక్కలేదు…

దీంతో ఆయన అలక చెందారు… రాజకీయ సమీకరణాలవల్ల జగన్ మంత్రి పదవిని అనిల్ కు కట్టబెట్టారు… అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు… ఇక మంత్రి హోదాలో అనిల్ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకుంటువెళ్తున్నారు… ఒకవైపు అనిల్ మరో వైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు జిల్లాలో పట్టు సాధిస్తున్నారు… దీంతో తన అధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోననే ఉద్దేశంతో ఆనం విమర్శలు చేశారని అంటున్నారు..