ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు

ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు

0
119

72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు… తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల నిర్వాహణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు…

ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ రిజర్వేష న్ 6.77 శాతం ఎస్సీ రిజర్వేషన్ 19.08 శాతం బీసీ రిజర్వేషన్ ను 34 శాతంగాను నిర్ణయించినట్లు వివరించారు నాని…

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రి మండలి తీర్మాణించినట్లు తెలిపారు నాని…