పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో ఫిరోజ్‌పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
“దేవి తలాబ్ మందిరాన్ని దర్శించుకోవాలనేది నా కోరిక. కానీ, ఇక్కడి పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయి. హెలికాప్టర్లో వెళ్లిపోవాలని సూచించాయి. ఇలా ఉంది ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి. కానీ, నేను మళ్లీ వచ్చి మందిరాన్ని దర్శించుకుంటానని మోడీ తెలిపారు.