ప్రేమించిన పాపానికి ఏకంగా హత్య చేసి వారిని కడతేరుస్తున్నారు కొందరు తల్లిదండ్రులు, తమ కుమార్తెని ప్రేమిస్తే ఆ ప్రేమని తట్టుకోలేక ఏకంగా వారిని చంపేస్తున్నారు, ఇప్పటికే ప్రణయ్ హత్య తర్వాత ఇలాంటివి జరగకూడదు అనుకుంటే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి హత్యే జరిగింది
తాజాగా మరో ప్రణయ్ హత్య కూడా ఇలాగే జరగడం షాక్ కి గురిచేస్తోంది..ప్రేమ వ్యవహారం యువకుడి దారుణ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో రాత్రి దారుణమైన ఘటన జరిగింది..
ఇక్కడ ప్రణయ్ అనే యువకుడిని గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు, అయితే అతనికి ఎవరితో వివాదాలు లేవు, కాని అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఇక అమ్మాయి పేరెంట్స్ కి ఈ ప్రేమ నచ్చలేదు, దీంతో అతనిని చంపేసి ఉంటారని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు
తాజాగా ఇందులో నిజాలు బయటకు వచ్చాయి అనిల్ అనే వ్యక్తి ప్రణయ్ ని హత్య చేశాడని తేలింది..తన చెల్లెలితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం ఇష్టం లేక ప్రణయ్ ని దారుణంగా హత్య చేసినట్లు చెప్పాడు.