టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తులకు ఇది చాలా సంతోషాన్ని కలిగించింది, మరి తాజాగా ఏం నిర్ణయం తీసుకుంది అనేది చూద్దాం.. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడి వృద్ధులకు దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని టిటిడి దర్శనాల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది.
అయితే తాజాగా ఇక అందరు భక్తులకి దర్శనం కలిగిస్తున్నారు, ఇక కచ్చితంగా స్వియ నియంత్రణ ఉండాలి జాగ్రత్తలు తీసుకుని దర్శనం చేసుకోవాలి అని తెలిపారు.. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్ల సౌకర్యం లేదని అధికారులు తెలిపారు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ,శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన తర్వాత, పది ఏళ్ల లోపు చిన్నారులు 65 ఏళ్ల పైబడిన వారికి ఆంక్షలు పెట్టింది తితిదే, తాజాగా అనుమతి ఇచ్చింది దర్శనానికి అందరికి , మొత్తానికి మొక్కులు ఉన్న చాలా మంది ఇన్ని రోజులు పిల్లలతో రాలేదు… ఇక చిన్నారులకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఇటు తిరుమలకు వచ్చేందుకు సంతోషం అంటున్నారు భక్తులు.