ఫోన్ పే ఇప్పుడు కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు, డిజిటల్ పేమెంట్లలో దూసుకుపోతోంది, ఏ చిరు వ్యాపారి అయినా దీనిని వాడుతున్నారు, అయితే అనేక సర్వీసులు కూడా అందిస్తోంది ఫోన్ పే , తాజాగా కస్టమర్లకు మరో కొత్త సర్వీసుని అందుబాటులోకి తీసువచ్చింది.
ఇకపై కారు, బైకు ఇన్సురెన్స్ సేవలను ఫోన్ పే ద్వారా పొందవచ్చు.ఇప్పటికే ఈ సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలిసి ఫోన్ పే ఈ సేవలనందించనుంది.ఇక ఇప్పుడు బైక్ కి కూడా ఇన్సూరెన్స్ అందిస్తుంది.
బైకులకి 482 నుంచి, కారు ఇన్సూరెన్స్ రూ. 2,072 నుంచి ప్రారంభమవుతాయి. ఇలా మీరు ఇన్సూరెన్స్ పేజ్ నుంచి ఆ యాప్ లో వీటిని తీసుకోవచ్చు, ఇక మీరు దీని చెల్లింపులు కూడా డిజిటల్ పేమెంట్ చేయవచ్చు యాప్ ద్వారా.. థర్డ్ పార్టీ గ్యారేజీలతో క్యాష్లెస్ రిపేరింగ్ సర్వీసులనందిస్తామని ఫోన్పే ప్రకటించింది.
నోట్ ……. ఫోన్పే యాప్లోని ఇన్సూరెన్స్ విభాగంలో ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ పేజీ నుంచి దీనిని చేసుకోవచ్చు