తెలంగాణకు మరో మణిహారం..నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

0
100

ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీ-హబ్ హైదరాబాద్ లో నిర్మించబడింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి కల్పించేలా నిర్మించిన అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ గా వెలుగొందనుంది.

నేడు ఈ టీహబ్‌ ను సీఎం కేసీఆర్‌ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్‌మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరవు అడుగుల్లో) దీనిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైయింట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు పాల్గొననున్నారు.

కాగా టీ హబ్‌ –2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌ను ఏర్పాటు చేశారు.