Flash News: దేశంలో మరో కొత్త పార్టీ..పేరును ప్రకటించిన గులాం నబీ

0
94

సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబి ఆజాద్ కొత్త పార్టీ పేరును, జెండాను ఖరారు చేశారు. నూతన పార్టీకి డెమొక్రటిక్ ఆజాద్ పార్టీగా నామకరణం చేశారు. అలాగే తెలుపు, నీలం, ఆవరంగులతో కూడిన జెండాను ఆవిష్కరించారు. కాగా కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ ను వీడిన గులాం నబి ఆజాద్ కొత్త పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఆయన నేడు అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో దేశంలో మరో కొత్త పార్టీ రానుంది.