ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (TSNPDCL) పరిధిలో82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు జులై 11. ఆగస్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.