TSRTC మరో ఆఫర్..ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ

0
98

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్ – విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ – బెంగ‌ళూరు వెళ్లే గ‌రుడ‌, రాజ‌ధాని స‌ర్వీసుల ఛార్జీల‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ రెండు మార్గాల్లో నడిచే అంత‌ర్రాష్ట్ర బ‌స్సులు అంటే గరుడ ప్లస్‌, రాజ‌ధాని స‌ర్వీసుల‌లో శుక్రవారం, ఆదివారం మిన‌హా మిగ‌తా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ క‌ల్పిస్తున్నట్లు వెల్లడించారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వ‌ర‌కు వ‌ర్తించ‌నున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.