ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు, అంతేకాదు గ్రామ సచివాలయ వ్యవస్ధ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు ఇంటికి అందిస్తున్నారు, అంతేకాదు గతంలో రేషన్ కార్డు కావాలి అంటే సుమారు ఏళ్లకు ఏళ్లు సమయం పట్టేది.
కాని ఇప్పుడు రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే కనీసం 10 రోజుల్లో అర్హులు అయితే వస్తోంది..నవశకం కార్యక్రమం ద్వారా తెల్లరేషన్ కార్డులు పొందనివారు, మరోసారి కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది..
ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగివున్నవారు, అత్యధిక విద్యుత్ వినియోగం, ఇతర కారణాల వల్ల నవశకం కార్యక్రమంలో తెల్లరేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు. మీరు సరైనా ఆధారాలు చూపించి అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మీ పేరును డిలీట్ చేసుకుని, మీ తల్లి దండ్రుల పేర్లతో కొత్త కార్డ్ పొందవచ్చు, గ్రామ సచివాలయాల్లో మీరు అప్లై చేసుకోవాలి.