స్కాల‌ర్‌‌షిప్స్‌ దర‌ఖాస్తుకు మరో అవకాశం..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Another opportunity to apply for scholarships..when is the last date?

0
94

క‌రోనా కార‌ణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు ఈ స్కాల‌ర్‌షిప్‌లు కొంతమేర ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రస్తుత విద్యా‌సం‌వ‌త్సరా‌నికి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రం‌లోని అన్ని కళా‌శా‌లల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యా‌ర్థులు వచ్చే ఏడాది జన‌వరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్డ్‌ కులాల కార్యదర్శి రాహు‌ల్‌‌ బొజ్జా ఉత్తర్వులిచ్చారు.

కళా‌శా‌లల యాజ‌మ‌న్యాలు లేదా విద్యా‌ర్థులు వ్యక్తి‌గ‌తంగా ఈ–పాస్‌ పోర్టల్‌లో దర‌ఖా‌స్తులు అప్‌‌లోడ్‌ చేయా‌లని సూచిం‌చారు. ఈ–పాస్‌ వెబ్‌‌సైట్‌ ద్వారా స్కాల‌ర్‌‌షిప్స్‌ రెన్యూ‌వ‌ల్‌కు 7,97,656 విద్యా‌ర్థుల్లో ఇప్పటి‌వ‌రకు 31,369 మందే దర‌ఖాస్తు చేసు‌కు‌న్నా‌రని, 5,50,000 మంది కొత్త విద్యా‌ర్థు‌లకు 1,959 మందే దర‌ఖాస్తు చేసు‌కు‌న్నా‌రని పేర్కొ‌న్నారు. ఈ నేప‌థ్యంలో దర‌ఖాస్తు గడు‌వును జన‌వరి 31కు పొడి‌గిం‌చి‌నట్టు తెలిపారు.