నీరవ్ మోదీకి మరో షాక్.. సింగపూర్ కోర్టు ఆదేశాలు

నీరవ్ మోదీకి మరో షాక్.. సింగపూర్ కోర్టు ఆదేశాలు

0
105

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన సోదరి పూర్వీ మోదీల ఖాతాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే నీరవ్ మోదీకి సింగపూర్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. సోదరి పూర్వీ మోదీ, బావ మయాంక్ మెహతా ఖాతాలను స్తంభింపజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ. 44.41 కోట్ల డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్ ఖాతాను తమ విన్నపం మేరకు నిలిపివేసిందని ఈడీ తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్ లోని జైల్లో నీరవ్ మోదీ ఊచలు లెక్కిస్తున్నాడు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో… బ్రిటన్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది.