పవన్ కు మరో ఊహించని షాక్

పవన్ కు మరో ఊహించని షాక్

0
87
Pawan Kalyan

ఇటీవల జనసేన పార్టీలో లుకలుకలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి… అయితే మరీ ముఖ్యంగా కొందరు సీనియర్లు పార్టీకి రాజీనామా చేస్తారు అని వైరల్ అయ్యాయి.. ఈ సమయంలో ఆ పార్టీకి సీనియర్ నాయకుడు జనసేన సిద్దాంతాలు నమ్మి వెళ్లిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు.

రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు., పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దీంతో జనసేన సైనికులు షాక్ అయ్యారు

కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా ఉండటం లేదు ..ఈ సమయంలోనే ఆయన గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపించాయి. ఆయన లేఖలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ప్రజల కోసం ఈ జీవితం అంకితం అని మీరు మొదట చెప్పారు. సినిమాలు చేయనని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. మీకు నిలకడలేదన్న విషయం ఈ నిర్ణయంతో వెల్లడైంది. అందుకే నేను జనసేన నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు, విశాఖ జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, తాను పార్టీలో లేకపోయినా మీకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటా అన్నారు.