కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… మున్సిపల్ ఎన్నికల్లో కొండంగల్ మున్సిపల్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది… ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కొడంగల్ పై ఉంది… ఇక్కడ ఏ పార్టీ నెగ్గుతాదనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది…
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో చారిత్రాత్మక ఫలితాలు వచ్చాయి… ఈ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి చెందిన సంగతి తెలిసిందే… ఆతర్వాత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ మల్కాజిగి స్థానంలో నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి విజయం సాధించారు…
ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో కొడంగల్ లో సత్తా చాటాలని చూసిన ఆయనకు చివరకు నిరాశ ఎదురు అయింది… 12 వార్డులకు గాను 8 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం 3 వార్డులు మాత్రమే గెలుచుకుంది…