Breaking News: టీఆర్ఎస్ కు మరో షాక్

0
78

తెలంగాణలో అధికార పార్టీ తెరాసకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి ఇతర పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. దీనితో గులాబీ బాస్ గుండెల్లో గుబులు పుట్టింది. మొన్నటికి మొన్న పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్, మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

ఇక ఇప్పుడు బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత రెడ్డి (టీఆర్ఎస్) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు మేయర్ పారిజాత రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ చేరికలతో అధికార పార్టీ కారుకు బ్రేకులు వేసినట్లు అయింది.