తెలంగాణ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం

0
92
Telangana Congress Party

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుత పరిస్థితి ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడగా..ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు టిఆర్ఎస్ ను వీడారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీల్లోనూ వలసల కలకలం కొనసాగుతుంది. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లీడర్లు ఆయా పార్టీల్లోకి చేరుతున్నారు. ఇక తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అంతేకాదు తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.

కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో కాస్త డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీకి.. తెలంగాణ ఇంటి పార్టీ విలీనం కాస్త ఊరట కలిగించే అంశం. రేవంత్‌ రెడ్డి పని తీరు, టీఆర్‌ఎస్‌ కు కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయం అనే రెండు అంశాలను బేరీజు వేసుకున్న చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

చెరుకు సుధాకర్